calender_icon.png 17 March, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి

16-03-2025 11:44:21 PM

సీఎం కుటుంబంలోని మహిళలను దూషించడం స్వేచ్ఛ కిందకు రాదు..

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి..

హైదరాబాద్‌సిటీబ్యూరో (విజయక్రాంతి): జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. సోషల్‌ మీడియాలో మాట్లాడుతున్న భాష సరైందేనా అనే అంశంపై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం(టీయూజేఎస్) ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ... భావప్రకనకు మాత్రమే స్వేచ్ఛ ఉందని, బూతుకు స్వేచ్ఛలేదన్నారు. ఇటీవల మహిళా జర్నలిస్టు రేవతి అరెస్ట్ ను ఎడిటర్ గిల్డ్స్ ఎలా ఖండిస్తుందని ప్రశ్నించారు.

పాశం యాదగిరి మాట్లాడుతూ... విమర్శలు చేయడం తప్పు కాదని, వ్యక్తిగత వ్యవహారాను దూశించడం సరికాదన్నారు. జర్నలిజం అంటేనే ప్రశ్నించడమని, కానీ జడ్జిమెంట్ ఇవ్వడం సరికాదన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. సోషల్‌మీడియాను సరిగా వినియోగించకపోతే మనకే ఇబ్బందులొస్తాయని చెప్పారు. ప్రజలు ఆవేశంతో మాట్లాడినా ఎడిట్ చేసి ప్రసారం చేయాలనానరుఉ. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం ఫేక్‌న్యూస్ వేగంగా వ్యాప్తి జరుగుతోందని, రాజకీయ నాయకుల నోళ్ల నుంచి కూడా బూతు పురానం వస్తోందన్నారు. నాగరిక సమాజంలో అనాగరిక భాషేంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, జర్నలస్టులు తులసిచందు, కరుణాదేశాయ్, వేణుగోపాల్, రమణ, టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు, మామిడిసోమయ్య, బసవపున్నయ్య, టీయూజేఎస్ ప్రధానకార్యదర్శి టి.రమేష్‌బాబు, ఉపాధ్యక్షులు పసునూరి రవిందర్, తదితరులు పాల్గొనానరు.