calender_icon.png 29 September, 2024 | 2:53 AM

నాసిరకం సరుకులతో భోజనమా?

29-09-2024 01:00:10 AM

  1. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద ఆగ్రహం
  2. సోన్, నిర్మల్ కేజీబీవీల తనిఖీ

నిర్మల్, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): ని ర్మల్ పట్టణంలోని సోన్, నిర్మల్ అర్బన్ కేజీబీవీలను శనివారం మహిళా కమిషన్ చైర్‌ప ర్సన్ నేరేళ్ల శారద తనిఖీ చేశారు. విద్యార్థుల తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వ ంట సరకులు పరిశీలించగా బియ్యం, పప్పు లు, రవ్వ నాసిరకంగా ఉన్నట్టు గుర్తించారు.

దీంతోపాటు భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పడంతో నిర్వాహ కులపై నేరేళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం సరుకులతో వంటలు చేస్తున్నారా అని మండిపడ్డారు. నాణ్యమైన భోజనం అ ందివ్వాలని ఆదేశించారు. పాఠశాలలకు అవసరమైన ఉపాధ్యాయుల నియమించాలని డీఈవో రవీందర్‌రెడ్డికి సూచించారు. ఆమెవెంట డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, అధికారులు సలోమి కరుణ, పద్మ, లతదేవి, సుజాత, గాజుల రవికుమార్ ఉన్నారు.

సఖి కేంద్రం తనిఖీ

ఆదిలాబాద్(విజయక్రాంతి): ఆదిలాబా ద్ సఖి కేంద్రాన్ని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరేళ్ల శారద తనిఖీ చేశారు. మహిళా క మిషన్ టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు చైల్డ్ హె ల్ప్ లైన్, సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ నం బర్లతో హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో, అంగనాడి కేంద్రాల్లో, కూడళ్లలో  హోర్డింగ్, బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆమెవెంట కమిషన్ మెంబర్ ఈశరి బాయి, సెక్రటరీ సుభద్ర, డీడబ్ల్యూవో సబిత ఉన్నారు.