calender_icon.png 19 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్ళాలి

19-04-2025 08:54:53 PM

నియోజకవర్గ సమన్వయకర్త ఆదర్శ్ రెడ్డి

పటాన్ చెరు: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లాలని పటాన్ చెరు నియోజకవర్గ సమన్వయకర్త ఆదర్శ రెడ్డి జిన్నారం మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు  పిలుపునిచ్చారు. శనివారం గడ్డపోతారంలోని పులిగిల్ల ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిన్నారం మండల, బొల్లారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శించారు. 

ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో వీటిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, నాయకులు వెంకటేశం గౌడ్, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, గడ్డపోతారం మాజీ సర్పంచ్ ప్రకాశ్ చారి, పార్టీ యువ నాయకులు పృథ్వీరాజ్,  మాణిక్ యాదవ్, తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.