16-03-2025 07:58:15 PM
మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ - లయన్ డాక్టర్ నీలి ప్రకాష్..
చర్ల (విజయక్రాంతి): మీకోసం మేమున్నాం టీం చర్ల అధ్వర్యంలో నిర్వహిస్తున్న వారాంతపు ప్రతీ ఆదివారం అన్నదానం 172వ వారం కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు జగిడి వరలక్ష్మి జ్ఞాపకార్ధం తల్లిదండ్రులు జగిడి రామారావు కనకమ్మ దంపతులు రూ 4,000 /- వితరణతో ఆదివారం చర్ల శాంతి భవన్ సమీపంలోని రౌతు నర్సింహారావు కాంప్లెక్స్ తాళ్ళూరి గార్డెన్స్ వద్ద సుమారు 250 మందికి గిరిజనులకు అన్న సంతర్పణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ... ప్రతీ ఆదివారం చర్లలో జరిగే సంతకు వచ్చిన పేదల ఆకలి తీర్చడానికి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఔన్నత్యంతో కూడుకున్నదని, మానవ సేవే మాధవసేవగా ప్రతీ ఒక్కరూ కూడా తమ బాధ్యతగా ముందుకొచ్చి తమతమ శుభకార్యాలను, జ్ఞాపకార్ధ కార్యాలను ఈ పేదవారి దీవెనలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నదాతల కుటుంబ సభ్యులతో పాటూ, సంస్థ సభ్యులు తమ సేవలందించారు.