20-04-2025 10:31:26 PM
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో వీటిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుంకర అజయ్ కుమార్. పిఎసిఎస్ చైర్మన్‌లు కందిబండ సత్యనారాయణ, వల్లపు రామిరెడ్డి, తోగరు సీతారాములు, మండల పార్టీ అధ్యక్షుడు తొగర్ రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉడుం కృష్ణ, లక్య నాయక్ ఎల్ రామయ్య, లింగయ్య, శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.