21 కిలోల గంజాయి స్వాధీనం, ముగ్గురి అరెస్ట్
శేరిలింగంపల్లి(విజయక్రాంతి): మియాపూర్ లో గంజాయి రవాణా చేస్తున్న నలుగురు ముఠా సభ్యులు పట్టుబడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం మియాపూర్ మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ రోడ్డులో మియాపూర్ పోలీసులు, ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ మహీంద్రా కారును ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 21 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి ఒరిస్సా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు నిందితులు అందులో ఒరిస్సా కు చెందిన ఇద్దరు, హైదరాబాదుకు చెందిన ఒకరిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల సమాచారం.