ఏటీఎం లో చొరపడి కత్తితో బెదిరించి డబ్బులు లాక్కునే ప్రయత్నం
మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో మినీ ఏటీఎం లో శుక్రవారం రాత్రి ముసుకు దొంగ వ్యవహారం కలకలం సృష్టించింది. ఏటీఎం లోకి చొరపడిన దొంగ కత్తితో బెదిరించి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ఇంట్లో ఉన్న రజీత కేకలు వేయడంతో స్థానికులు ఆ దొంగను పట్టుకునే లోగా తప్పించుకొని పారిపోయాడు. సమాచారం అందుకున్న మంథని ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ఆ దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.