calender_icon.png 22 October, 2024 | 5:29 PM

అరాచకాలను అంతం చేసే మాస్క్ మ్యాన్

22-10-2024 12:00:00 AM

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించగా, డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం మేకర్స్ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

అరాచకాలను అంతం చేయడానికి దేవుడు అనేక రూపాల్లో వస్తాడని, దేవుడిలానే కాదు రాక్షసడిలా కూడా రావచ్చని ట్రైలర్ చెబుతోంది. శ్రీమురళి పోలీసు అధికారిగా, మాస్క్ మ్యాన్ బఘీరగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. రుక్మిణి వసంత్ అతని లవ్ ఇంట్రస్ట్‌గా కనిపించారు.

ట్రైలర్‌లో ప్రకాశ్‌రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్‌కుమార్, గరుడ రామ్ వంటి నటుల ను కూడా పరిచయం చేశారు. ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ ద్వారా తెలుగులో విడుదలవుతున్న ఈ చిత్రానికి సంగీతం: బి అజనీశ్ లోక్‌నాథ్; యాక్షన్: చేతన్ డీ సౌజా; కథ: ప్రశాంత్ నీల్; స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: డాక్టర్ సూరి.