11-12-2024 01:26:34 AM
మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి):మావోయిస్టు పార్టీకి చెందిన వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీ సభ్యుడు మంగళవారం ములుగు జిల్లా పోలీసులకు లొంగిపోయాడు. వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీకి చెందిన పార్టీ సభ్యుడు లేఖం లచ్చు అలియా స్ అశోక్ మంగళవారం ములుగు వోఎస్డీ ఎదుట లొంగిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా స్వచ్ఛందంగా లొంగిపో యి, జనజీవన స్రవంతిలో కలవాల ని, వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ములుగు వోఎస్డీ తెలిపారు.