12-02-2025 12:12:01 AM
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి౧౧ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహా కుంభమేళాలో పుణ్య స్థానానికి వెళ్లిన ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన వ్యక్తి అస్వస్థతకు గురై మరణించినట్లు మృతుడి సన్నిహితులు తెలిపారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన మాజీ వార్డు మెంబర్ యం.శంకర్(44) ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాలో పుణ్య స్థానానికి వెళ్లి అక్కడ సోమవారం నాడు అస్వస్థతకు గురికావడంతో అలహాబాద్ లక్నోలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని తెలిపారు.
ఆయన మరణంతో ఎల్లారెడ్డిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఉత్సాహంతో మహాకుంభమేళలో పుణ్య స్నానానికి వెళ్లి మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానికులు దిగ్బ్రాంతికి గురయ్యారు. మంగళవారం నాడు వారి స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.