calender_icon.png 16 November, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాలీ ఆటోను కారుతో గుద్ధి పరారైన వ్యక్తి

16-11-2024 04:52:24 PM

అధిక వేగమే ప్రమాదాని కారణం

మణుగూరు (విజయక్రాంతి): కారుతో ట్రాలీ ఆటోను గుద్ది ముగ్గురు వ్యక్తులను గాయపరిచిన వ్యక్తి తిరిగి చూడకుండ పరారైన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. బాదితుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన కొరమని సత్యవతి భవానిమాల విరుముడి కోసం భర్త సత్యనారాయణ, కుమారుడు సాయికుమార్ తో గత బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని భవాని మాత ఆలయంకు బయల్దేరారు. మార్గమధ్యలో పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ ఉప్పాక బ్రిడ్జి వద్ద మణుగూరు నుండి అధికవేగంతో వస్తున్న AP 05 EA 5302  నెంబర్ గల కారుపూర్తిగా రాంగ్ రూట్లోకి వచ్చి  TS37 T0242 నెంబర్ గల  ట్రాలీ ఆటోను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. బాధితులను అంబులెన్స్ లో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. కారుతో గుద్దిన వ్యక్తి కనీస ధర్మాన్ని నెరవేర్చకుండా గుద్దిన వెంటనే పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని ఒక ప్రముఖ హోటల్ లో పార్కింగ్ చేసి ఉన్నట్లు వివరాలు తెలియవస్తున్నాయి. గురువారం సాయంత్రం ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు అందజేసినట్లు బాధితులు తెలిపారు. నిరుపేదలమైన మాకు ఆసరా, అండగా ఎవరూ లేరని ప్రమాదాన్ని కారణమైన వ్యక్తులను గుర్తించి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా బాధితులు వేడుకుంటున్నారు. 

ప్రమాదానికి కారణమైన వ్యక్తులను గుర్తించాం... ఎఫ్ఐఆర్ నమోదు చేశాం 

జరిగిన ప్రమాదానికి సంబంధించి ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజ్ కుమార్ ని వివరణ కోరగా.. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేశామన్నారు. యాక్సిడెంట్ కు కారణమైన కారును, వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు. కారు AP 05 EA 5302  నెంబర్ గల వ్యక్తి భద్రాచలం పట్టణానికి చెందిన దంతులూరి సింహాద్రి వర్మగా గుర్తించి, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.