18-03-2025 01:25:09 AM
తుంగతుర్తి మార్చి 17: రాజకీయ కక్షల నేపథ్యంలో మాజీ సర్పంచ్ మెంచ్ చక్రయ గౌడ్ పై ప్రత్యర్ధులు దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన చెందిన చక్రయ గౌడ్ (68)ప్రత్యర్ధులు కత్తులతో దాడి . చేసి కిరాతకంగా హత్య చేశారు.
అనంతరం ఆయనను సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు సమా చారం. జరిగిన సంఘటనపై తుంగతుర్తి సీఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరిపి కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనితో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.