calender_icon.png 18 March, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ కక్షలతో వ్యక్తి దారుణ హత్య

17-03-2025 10:32:15 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): రాజకీయ కక్షల నేపథ్యంలో మాజీ సర్పంచ్ మెంచ్ చక్రయ గౌడ్ పై ప్రత్యర్ధులు దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చక్రయ గౌడ్(68) ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆయనను సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం. జరిగిన సంఘటనపై తుంగతుర్తి సీఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరిపి కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనితో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.