calender_icon.png 4 January, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాన్ ఈటార్ దొరికింది....!

01-01-2025 08:39:00 PM

జిల్లాను వనికించిన పులి..

బంధించిన మహారాష్ట్ర అటవీ అధికారులు... 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా ప్రజలను గత రెండు నెలలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్న పులినీ సిర్పూర్ టి మాకిడి అటవీ ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఆత్మారాంగుడా సమీప అటవీ ప్రాంతంలో అక్కడి ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. గత ఎడాది నవంబర్ 29 న కాగజ్ నగర్ గన్నారం గ్రామ సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న లక్ష్మిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మరుసటి రోజు సిర్పూర్ టి మండల సమీపంలో చేనులో పత్తి ఎరుతున్న రౌతు సురేష్ పై దాడికి పాల్పడింది. అప్పటినుండి పులి కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో ఏదో ఒక చోట పర్యటిస్తూ దర్శనం ఇవ్వడంతో జిల్లా ప్రజలకు కంటినిండా నిద్ర కరువైంది. పులులు మహారాష్ట్ర వైపు నుండి జిల్లాకు వస్తున్నట్లు జరిగిన ప్రచారం నేపథ్యంలో అక్కడి ఆటవిశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి నివేదిక సమర్పించారు. మాన్ ఈటరుగా మారిన మగ పులిని పట్టుకునేందుకు అనుమతులు లభించడంతో మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకునేందుకు గత వారం రోజులుగా ప్రయత్నాలు మమ్మురం చేశారు. మంగళవారం రాత్రి పులిని పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.