calender_icon.png 26 December, 2024 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

04-11-2024 01:48:32 AM

కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం రాంసాగర్ తండాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఆజ్మీరా చందర్(49) అనే వ్యక్తి తన పొలం పక్కనే ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు.ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయినట్లు ఎస్సై మనోజ్‌కుమార్ తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.