ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 30: క్రేన్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదిభట్ల పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆమనగల్, సింగంపల్లికి చెందిన జంగయ్య (53) కొంతకాలంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ రాగన్నగూడ, జీవీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాగన్నగూడ గణేశ్ టెంపుల్ వద్ద నుంచి జంగయ్య నడుచుకుంటూ వెళ్తుండగా క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టాడు. జంగయ్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు.