కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలో ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): చెట్లు వస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ఆడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. సదాశివ నగర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన చెట్టుకూరి కృష్ణారెడ్డి వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్లను విద్యుత్ మిషన్తో కోస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ వచ్చి సిద్ధి రాములు 45 అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. స్థానికులు గమనించి విద్యుత్ షాక్ తగలడంతో సిద్ధిరాములు కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే సిద్ధిరాములు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.