రామాయంపేట (విజయక్రాంతి): ఈ రోజు ఉదయం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ముద్రబోయిన మల్లయ్య అనే వ్యక్తి (48) మత్స్యకారుడు, తను చేపలు పట్టుకునే చెరువులో నష్టం రావటంతో అప్పుల పాలు అయ్యాడు. దీంతో జీవతంపై విరక్తి చెంది నిన్న రాత్రి సమయంలో ఇంట్లో నుండి వెళ్లి లక్ష్మాపూర్ గ్రామ శివరులోని చెట్టుకు లుంగితో ఉరివేసుకొని మృతి చెందాడు. ఈట్టి విషయమై మృతుని భార్య రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.