calender_icon.png 25 January, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతి..

24-01-2025 04:19:11 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలో చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం ఉదయం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బర్లగూడెం గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.