సూర్యాపేట (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందని ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహడ్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన, పోలీసులు వివరాల ప్రకారం పెన్పహడ్కు చెందిన ఒగ్గు బిక్షం(45) తన వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభంపై జంపర్ వైరు కలుపడానికి స్తంభం ఎక్కగా ప్రమాదవశాత్తు జారీ పడటంతో తలకు బలమైన గాయాలు కాగా జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పటల్‌కు తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతిని భార్య ఒగ్గు శైలజ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపికృష్ణ తెలిపారు.