calender_icon.png 1 March, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి

28-02-2025 10:30:31 PM

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం కోయగూడెంలో గ్రామ సమీపంలో ట్రాక్టర్ కింద పడి శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్రాస్ తండా గ్రామానికి చెందిన ముత్తి ముతీష్ ట్రాక్టర్ నడుపుతుండగా ఫీట్స్ రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పి దాని కింద పడిపోవడంతో మృతి చెందినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.