బెల్లంపల్లి (విజయ క్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల రైల్వే గేట్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని గూడ్స్ రైలు ఢీకొని గంగారం నగర్ కు చెందిన తిప్పర వేణి శ్రీను (45) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కన్నాల బస్తీలో ఉండే తన బంధువుల ఇంటికి వెళుతున్న క్రమంలో రైల్వే లైన్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. మృతుడు శ్రీను కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు స్థానికులు బెల్లంపల్లి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.