calender_icon.png 9 January, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి..

08-01-2025 10:00:02 PM

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో రైల్వే స్టేషన్ రోడ్డు శివాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కామారెడ్డి జిల్లా రతల రాంరెడ్డి గ్రామానికి చెందిన దండ బోయిన నారాయణ (59) అక్కన్నపేటలో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. కాగా, బుధవారం రాత్రి 7 గంటల సమయంలో రోడ్డు వెంట వెళ్తుండగా గుర్తుతెలియని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై బాలరాజ్ తెలిపారు.