calender_icon.png 7 January, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ ఢీకొని వ్యక్తి మృతి

12-10-2024 02:44:44 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 11: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వెంకటరామిరెడ్డి కథనం ప్రకారం.. హసన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అజర్ (28) గురువారం అర్ధరాత్రి అత్తాపూర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 132 మీదుగా యాక్టివాపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.