23-03-2025 01:12:10 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): డీలిమిటేషన్‌తో దక్షిణాది భవి ష్యత్తు కు పెను ప్రమాదం పొంచిఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తంచేశారు. దశాబ్దాల నుంచి దక్షిణాదిపై వివక్ష కొనసాగుతోందన్నారు. డీలిమిటేషన్‌పై చెన్నై లో జరిగిన సదస్సుకు కేటీఆర్ హాజరై మాట్లాడారు.
ప్రస్తుత డీలిమిటేషన్ విధానానికి ప్రత్యామ్నాయ మార్గాలను అను సరించా లన్నారు. పార్లమెంట్ స్థానాలు యథాతథంగా ఉంచి ఎమ్మెల్యే సీట్లు పెంచాలన్నా రు. ఆయా రాష్ట్రాలు సాధించిన ఆర్థిక ప్రగతి, పరిపాలన విధానాలు, అభివృద్ధి ఆధారంగా డీలిమిటేషన్ జరగాలన్నారు. ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారకూడదని, దక్షిణాదికి శిక్ష కాదు.. ప్రోత్సా హం కావాలని చెప్పారు.
దక్షిణాది హక్కు ల కోసం పోరాడకపోతే చరిత్ర క్షమించదని కేటీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గవు అంటే, ఉత్తరాదిన సీట్లు పెరుగుతాయా అని ఆయన ప్రశ్నించారు. భారతదేశం ప్రజాస్వామిక దేశమైనప్పటికీ భిన్న సంస్కృతులు, అస్తిత్వాలతో కూడుకున్నదన్నా రు. 50 ఏళ్ల పాటు జనాభా ఆధారంగా సీట్ల పెంపును నిలిపివేసి ఇప్పుడు డీలిమిటేషన్ చేయడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ 14 ఏళ్లపాటు ఉద్యమం చేశారని, ఢిల్లీలోని మందబలాన్ని ఎదురిస్తూనే.. మరోవైపు సమైక్య రాష్ట్రంలో మెజార్టీ నాయకత్వంపై పోరాటం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన డీలిమిటేషన్ హామీలను విస్మరించిందన్నారు.
దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో కలిసి డీలిమిటేషన్‌పై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఎంపీలు మల్లు రవి, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ మంత్రు లు నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంబీర్‌పూర్ రాజు హాజరయ్యారు.