calender_icon.png 16 April, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 పరీక్షలో పెద్ద కుంభకోణం జరిగింది: ఎమ్మెల్యే కౌశిక్

14-04-2025 04:51:47 PM

హైదరాబాద్: గ్రూప్-1 పై సీబీఐ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని, ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఒక్క కోఠి కళాశాల 18, 19వ సెంటర్ల నుంచి 1490 మంది పరీక్ష రాస్తే 74 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. 25 సెంటర్లలో 10 వేల మంది పరీక్ష రాస్తే 69 మంది మాత్రమే ఎంపికయ్యారని, 654 మందికి ఒకేలా మార్కులు ఎలా వస్తాయి అని..? కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలికి ఎస్టీ నెం.1 ర్యాంక్ వచ్చిందని, రాములు నాయక్ కోడలు కోఠి కళాశాలలోనే రాశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెల్లడించారు. 

ఉర్దూలో రాసిన 9 మందిలో ఏడుగురు ఎంపికయ్యారని, టాప్ 100లో కూడా ఉర్దూ మీడియం వారు ముగ్గురు ఉన్నారని తెలిపారు. 8 వేలమంది తెలుగులో రాస్తే 60 మందే ఎంపికయ్యారని, 8 వేలమంది తెలుగులో రాస్తే టాప్ 100 లో నలుగురే ఉన్నారని ఎమ్మెల్యే కౌశిక్ తెలిపారు. పూజిత రెడ్డి రీకౌంటింగ్ కు వెళ్తే 60 మార్కులు తగ్గించారని, గ్రూప్-1 అంశంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లడట్లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకైతే పరీక్షలు రద్దు చేశామని, కాంగ్రెస్ హయాంలో లీకైతే ఎందుకు రద్దు చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు.