18-02-2025 06:35:36 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బోర్లం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బీ మోహన్ నాయక్, శ్రావణ్ కుమార్, రాజేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నేర్రె నర్సింలు, పార్టీ మాజీ అధ్యక్షులు గోపన్ పల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు.