- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- రూ. 6.82 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
పటాన్చెరు, జనవరి 23 : అమీన్పూర్ మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్నమున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నాన్నారు.
గురువారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో రూ.6.82 కోట్ల అభివృద్ధి పనులకు స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్ తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం లాలాబావి కాలనీలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో దశాబ్ద కాలంగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్లు తెలిపారు. ఐదు భారీ రిజర్వాయర్ నిర్మించి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, వీధిదీపాలు, పార్కులను నిర్మించామన్నారు.
అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.