calender_icon.png 11 February, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ కనకదుర్గ దేవాలయంలో ఘనంగా శివలింగ ప్రతిష్ట..

10-02-2025 06:56:33 PM

పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కొత్వాల దంపతులు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని ప్రసిద్ధిగాంచిన కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మతల్లి గుడి) ప్రాంగణంలో సోమవారం నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్టతో పాటు మహాకుంబాభిషేఖం, కల్యాణ మండపం, అన్నదాన సత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మాఘశుద్ధ త్రయోదశి సందర్భంగా స్థిర మంత్రం, విగ్రహ శిఖర ప్రతిష్ట, కుంభాభిషేఖం, ధ్వజస్తంభ ప్రతిష్ట, మహాన్నదాన కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొన్నారు. 

ఈ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో పెద్దమ్మతల్లి గుడి మాజీ చైర్మన్ మహీపతి రామలింగం, మాజీ డైరెక్టర్లు ఎస్విఆర్ కె, ఆచార్యులు, చింతా నాగరాజు, గంధం వెంగళరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, నాయకులు సందు ప్రభాకర్, బాదార్ల జోషి, శ్రీకాంత్, బానోత్ బాలాజీ, గంధం నర్సింహారావు, కాపర్తి వెంకటాచారి, తిరుమల రమేష్, ఎస్.కె  బాషా తదితరులు పాల్గొన్నారు.