నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఓ చెలియా’. నాగ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని రూపాశ్రీ, చంద్రమౌళి సంయుక్తంగా నిర్మిన్నారు. అజయ్ ఘోష్ కీలక పాత్రను పోషించనున్నారు. సునీల్ రావినూతల, ఐశ్వర్య నాయుడు, తన్వి, అమ్మరమేశ్, పెద్దిరాజు, తన్మయ, స్వప్న, దాస్ తదితరులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్న కుడితి శ్రీనివాస్, సతీశ్ సారిపల్లెల చేతుల మీదుగా మూవీ టీమ్ శనివారం
ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరింపజేసింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్లు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాం’ అని తెలిపారు. డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘హీరో నాగ ప్రణవ్ మొదటి సినిమా అయినా సీనియర్ యాక్టర్‌లా నటించాడు. 50 సినిమాలకుపైగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన కావేరి కర్ణిక మా మూవీతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ బాల; సంగీతం: ఎంఎం కుమార్; కొరియోగ్రఫీ: రామ్, దుర్గేశ్, మోహనకృష్ణ; ఫైట్స్: అశోక్ , రాజేశ్ లంక; ఎడిటర్: ఉపేంద్ర; ఆర్ట్: భూపతి యాదగిరి; అసిస్టెంట్ డైరెక్టర్: దుర్గ, ప్రసాద్; నిర్మాతలు: రూపాశ్రీ, చంద్రమౌళి; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగరాజశేఖర్‌రెడ్డి.