calender_icon.png 11 January, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుద్రారంలో జరిగే ప్రేమకథ

20-12-2024 12:00:00 AM

చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ మహీ ప్రతినాయ కుడిగా నటిస్తున్నారు. త్వరలోనే ‘బరాబర్ ప్రే మిస్తా’ విడుదల కానుంది. ఈ క్రమంలోనే గురువారం వీవీ వినాయక్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తెలంగాణలోని రుద్రా రం అనే గ్రామ నేపథ్యంగా కథ ఉంటుంది. పరస్పరం గొడవలు పడే ఊరిలో ఒక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీని చూపించబోతున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.

ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీని సంపత్ గారు ఎంతో క్లారీటీతో, మంచి క్వాలిటీతో రూపొందించారు’ అన్నారు. దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. “ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరి చేయాలని అనుకుని ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రారంభించాం. చంద్రహాస్ హీరోగా ఈ మూవీ స్టార్ట్ చేశాం” అని తెలిపారు. హీరోయిన్ మేఘనా ముఖర్జీ మాట్లాడుతూ..- “ఈ సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. మా టీమ్ అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం” అన్నారు. నిర్మాత చిన్ని గాయత్రి మాట్లాడుతూ.. “బరాబర్ ప్రేమిస్తా’ సినిమా కథ వినగానే నచ్చి నా ఫ్రెండ్స్‌తో కలిసి ప్రొడ్యూస్ చేశాను.

సినిమా బాగా రావాలని డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు”. అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, సినిమాటోగ్రాఫర్ వైఆర్ శేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ తదితరులు పాల్గొన్నారు.