calender_icon.png 18 October, 2024 | 11:56 PM

నిజాయితీ గల యువకుడి ప్రేమకథ

28-07-2024 12:05:00 AM

కృష్ణవంశీ, మోక్ష లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరాం జడపోలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల ఓ యువకుడి కథ ఇది. కథలోని డ్రామా, ఓమోషనల్ రిచ్‌నెస్‌ను ట్రైలర్ ఆవిష్కరించింది. డైలాగ్‌లు, సన్నివేశాలు, రొమాంటిక్ డ్రామా ఆకట్టుకున్నాయి. బ్రహ్మాజీ, వెంకటేశ్ కాకమాను, సుధ, ప్రమోదిని, చైతన్య గరికిపాటి తదితరులు ముఖ్య తారాగణంగా ఉన్న ఈ సినిమాకు సంగీతం శశాంక్ టి; సినిమాటోగ్రఫీ: ప్రేమ్‌సాగర్; కొరియోగ్రఫీ: మెహర్ బాబా, అజ్జు.