29-03-2025 01:12:28 AM
-విద్యుత్ స్తంభాలపై కుప్పలు తెప్పలుగా కేబుల్ వైర్లు
-తరచూ ప్రమాదాలు జరుగుతున్న మేల్కొని విద్యుత్ సిబ్బంది
-నిబంధనలు పాటించని ఇంటర్నెట్ ప్రొవైడర్లు, కేబుల్ ఆపరేటర్లు
-ఉడతా భక్తిగా సహకరిస్తున్న కొందరు అధికారులు
శేరిలింగంపల్లి, మార్చి 28(విజయక్రాంతి): ప్రతీ స్తంభానికి మీటర్ల కొద్ది వైర్లు, అందులో కరెంట్ వైర్ల కంటే ఎక్కువగా కేబుల్, ఇంటర్నెట్ వైర్లే ఎక్కువగా ఉంటా యి. అసలైన కరెంట్ వైర్ ఎక్కడుందో కూ డా కానరాని పరిస్థితి.
అంతలా కేబుల్ వైర్లు స్తంభాలకు వేలాడుతున్నాయి. తరచూ ప్ర మాదాలు కూడా చోటుచేసుకుంటున్నా యి. విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయి నా సంబంధిత అధికారులు మాత్రం కేబుల్ ఆపరేటర్లపై కానీ, ఇంటర్నెట్ సర్వీసు నిర్వహకులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
విద్యుత్ స్తంభాలా.. కేబుళ్ల కోసం వేశారా..?
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్లలోనూ లక్షలాది కరెంట్ పోల్స్ ఉన్నాయి. వీటి అన్నింటికి విద్యుత్ తీగలకంటే ఇతర కేబుల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కింది నుండి పై వరకు ఎప్పుడైనా కరెంట్ సమస్య వస్తే విద్యుత్ సిబ్బంది పోల్ ఎక్కేందుకు కూడా అవకాశం లేకుండా ఇష్టారీతిగా ఈ వైర్లు వేలాడుతూ కనిపిస్తుం టాయి.
అసలైన కరెంట్ వైర్ ఎక్కడుంది అనేది కనీసం లైన్ మెన్ కు కూడా అంతుచిక్కదు. ఎండాకాలం, వానాకాలంలో వీటితో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటా యి. గతంలో హాఫీజ్ పేట్ డివిజన్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కు ఈ కేబుల్ వైర్లు కూడా ఓ కారణమే అన్న విమర్శలు ఉన్నాయి.
విద్యుత్ సిబ్బందికి ఇవేమీ పట్టవా
విద్యుత్ స్తంభాలకు కరెంట్ వైర్లు మినహా మరేవీ ఉండకూడదు అనే నిబంధనను గాలికి వదిలేశారు ఆ శాఖ అధికారులు. విద్యుత్ శాఖ రెగ్యులేషన్ 2010 చట్టప్రకారం విద్యుత్ తీగలకు కేబుల్ వైర్లకు మధ్య 2.44 మీటర్ల దూరం పాటించాలి. అలాగే కరెంట్ పోల్స్ కు కేబుల్ వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సమీపంలో ఉండకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినా విద్యుత్ అధికారులు మాత్రం ఆ నిబంధనలు తుంగ లో తొక్కారు.
కొందరు అధికారులే కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లతో ఏరియాకు నెలకు ఇంత ఇవ్వాల్సి ఉంటుందని లెక్కలేసి చెప్తున్నారని, మేమేం చేస్తాం అం టూ క్రింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. అందుకే కేబుల్ ఆపరేటర్లు యథేచ్ఛగా కరెంట్ పోల్స్ కే దర్జాగా కేబుల్ వైర్లు వేయడమే కాకుండా అక్కడక్కడ బాక్సులు, ఇంటర్నెట్ ప్రొవైడర్ల కనెక్షన్ సెట్టింగ్ స్తంభాలకే ఫిట్ చేసేశారు.
మొద్దు నిద్రలో పెద్ద సార్లు
స్థంభాలకు కేబుల్ వైర్లు లాగడం వల్ల విద్యుత్ శాఖకు ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అదీలేదు. కేవలం కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలు, కొందరు విద్యుత్ ఉద్యోగుల స్వార్ధం మినహా విద్యుత్ శాఖకు దమ్మిడి ఆదాయం లేదు. ఒకరిద్దరు అధికారులు సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర భారీ ఎత్తున ముడుపులు గుంజుతున్నారని అందుకే చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ శాఖ అధికా రులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి కేబుల్ వైర్లను తొలగిస్తారా.. లేదా ఎప్పటిలాగే చేతులు తడిపితే చాలనుకుంటారా చూడలంటున్నారు ప్రజానీకం.