calender_icon.png 24 March, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే!

23-03-2025 01:02:37 AM

  1. జనాభా నియంత్రణ పాటించడమే పాపమైంది..
  2. జనాభా ప్రాతిపదికన ‘డీలిమిటేషన్’ చేస్తే రాజకీయ గళం కోల్పోతాం
  3. ఉత్తరాది ఆధిపత్యంతో ద్వితీయ శ్రేణి పౌరులమవుతాం..
  4. వచ్చే నెలలో హైదరాబాద్‌లో రెండో సమావేశం.. భారీ బహిరంగ సభ!  
  5.  చెన్నైలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్వి భజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరా టం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ఆధ్వ ర్యంలో చెన్నైలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు..

1971లో జనాభాను నియంత్రించాలని దేశం తీసుకున్న నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తూచ తప్పకుండా అమలుచేయడమే పాపమైందన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థికవృద్ధిని సాధించాయని, జీడీపీ, తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతులు, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయన్నారు.

దేశ ఖజానాకు దక్షిణాది రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నాయన్నారు. దేశానికి తెలంగాణ రూపాయి ఇస్తే 41 పైసలు మాత్రమే వెనక్కి వస్తోందని, అదే బీహార్ రూపాయి ఇస్తే రూ.9.22 తిరిగివస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోందన్నారు.

  “మనది ఒకే దేశం..  మనం దానిని గౌరవిస్తాం. కానీ,  ఈ పునర్విభజనను అంగీకరించం... ఎందుకంటే ఇది  దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కుదింపు..ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకోవాలి ”అని పిలుపు నిచ్చారు.  బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ గళాన్ని కోల్పోతాయన్నారు. 

రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలి

రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనా భా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలని, లోక్‌సభ స్థానాల పెంపు ను మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాల ని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  

దక్షిణాది రాష్ట్రాలకు 272 సీట్లు ఇవ్వాలి

లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబం ధం లేకుండా  చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన తెచ్చారు. “543 సీట్లు ఉన్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130.

మొత్తం సీట్లలో 24 శాతం మాత్రమే. పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్‌సభలో మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేయాలి. బీజేపీ 50 శాతం సీట్లను పెంచాలనుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు ఇవ్వా లి. ఈ సీట్లను తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచాలి. మిగిలిన సీట్లను ఉత్తరాది, ఇతర రాష్ట్రాలకు కేంద్రం తమ అభిమతం మేరకు పంచవ చ్చు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

ఐక్యంగా పోరాటం చేద్దాం.. 

దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు మన విభేదాలను విస్మరించి పునర్విభజనలో తగిన వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ  శాసనసభలో త్వరలోనే తీర్మానం చేసి ఆమోదిస్తామన్నారు. “పునర్విభజన ప్రక్రియపై తర్వాత సమావేశాన్ని వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తాం.

పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్దామనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిద్దాం. భారీ బహిరంగసభను నేను ఏర్పాటు చేస్తాను.” అని సీఎం పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్  కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు. 

పెత్తనాన్ని అంగీకరించం : ఎక్స్‌లో సీఎం రేవంత్ ట్వీట్

సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం..సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు..“రాజ్యవిస్తరణ కాంక్షతో, రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో డీలిమిటేషన్ చేస్తే మౌనంగా ఉండలేం.. డీలిమిటేషన్ అయినా, విద్యావ్యవస్థపై పెత్తనమైనా అంగీకరిం చం..ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం..ధర్మపోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది..ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది..”అని అందులో పేర్కొన్నారు.