calender_icon.png 23 December, 2024 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను ఢీకొట్టిన లారీ

08-10-2024 12:47:32 AM

ఇద్దరు మృతి

మహేశ్వరం, అక్టోబర్ 7: మీర్‌పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. నందనవనం బస్తీలో నివసించే అన్నోజు శ్రావణ్ కుమార్ చారి (40) రెండేళ్లు గా టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

రోజు మాదిరిగానే ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు ఉద్యోగానికి వెళ్లిన శ్రావణ్ కుమార్ మరుసటి రోజు సోమవారం ఉదయం 7 గంట ల సమయంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. కాగా, టీకేఆర్ కళాశాల సమీపంలో నివసించే షేక్ మదీన బాషా (42) పీర్జాది గూడలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగ నిమిత్తం మదీన బాషా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా శ్రావణ్ కుమార్ లిఫ్ట్ అడిగాడు.

ఇద్ద రు కలిసి నందనవనం వైపు వెళ్తుండ గా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన శ్రావణ్‌కుమార్, మదీన బాషా పైనుంచి లారీ చక్రాలు వెళ్లడం తో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అం దించడంతో ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలు తెలుసుకు న్నారు. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచా రణలో తేల్చారు. లారీని సీజ్ చేసి డ్రైవ ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసును మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.