calender_icon.png 20 January, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను ఢీకొట్టిన లారీ

11-09-2024 02:46:03 AM

తండ్రీకొడుకులు మృతి

వెల్దుర్తి, సెప్టెంబర్ 10: బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో తండ్రీకొడుకులు మృతిచెందారు. వివరాలిలా ఉన్నా యి.. చిన్నశంకరంపేట మండ లం సూరారం గ్రామానికి చెందిన దొంతి భూదయ్య (75), కుమారుడు దొంతి మల్లేశం (35) మంగళవారం బైక్‌పై తూప్రాన్‌కు బయలుదేరారు. మాసాయిపేట మండలం రామంతాపూర్ 44వ నంబర్ జాతీయ రహదారి వద్ద కు రాగానే.. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. వారి పై నుంచి లారీ వెళ్లడంతో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రం గా గాయపడ్డ భూదయ్యను 108 వాహనంలో తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మల్లేశంకు భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు.