జెసిబి సహాయంతో బయటకు తీసిన పోలీసులు
కామారెడ్డి జిల్లా ముస్తాపూర్ వద్ద ఘటన...
కామారెడ్డి (విజయక్రాంతి): గేదెలను మేపేందుకు వెళ్లిన ఓ యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా గురువారం రాత్రి వెనుక నుంచి లారీ ఢీకొనడంతో పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముస్తాపూర్ వద్ద కేకే వై రాహదారిపై చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొయ్య గుండు తండా చెందిన సభావత్ మోహన్ గేదెలను మేపేందుకు వెళ్లి తిరిగి తండాకు గురువారం రాత్రి వెళ్తుండగా కామారెడ్డి నుంచి లింగంపేట్ వైపు అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది.
లారీ అతి వేగంగా ఉండడంతో నడుచుకుంటూ వెళ్తున్న సభావాత్ మోహన్ ను వెనుక వైపు నుంచి ఢీకొనడంతో లారీ పొదల్లోకి దూసుకెళ్లింది. యువకుడు స్వభావత్ మోహన్ లారీ మధ్యలో ఇరుక్కోవడంతో జెసిబి సహాయంతో బయటకు తీసి గాయాలపాలైన మోహన్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. లారీడైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. లారీని అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎస్ఐ పేర్కొన్నారు.