అక్రమంగా వలస వెళ్తున్న వేలమంది భారతీయులు
ఆరు నెలల్లో 108 మంది ఏజెంట్లు అరెస్టు
న్యూఢిల్లీ, జూలై 11: భారత్ నుంచి అమెరికాకు అక్రమ వలసలు భారీగా పెరుగుతు న్నా యి. వివిధ దేశాలకు అక్రమంగా వలస వెళ్లేందుకు ఏజెంట్లకు లక్షలకు లక్షలు ముట్టజెప్పేం దుకు కూడా ప్రజలు వెనుకాడటంలేదు. అమెరికా, యూరప్ దేశాల్లో మంచి భవిష్యత్తు వెతుక్కొనేందుకు కష్టాలు ఎదురైనా వెరువకు ండా సాగిపోతున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలా మంది ఉత్త చేతులతో తిరిగి వ స్తున్నారు. గత ఆరు నెలల్లో మనుషుల అక్రమ రవాణా చేస్తున్న 108 మంది ఏజెంట్ల ను అరెస్టు చేశారు. వీరు భారతీయులను అక్ర మంగా విదేశాలకు తరలించే మార్గాలనే దర్యా ప్తు సంస్థలు డాంకీ రూట్ అని పిలుస్తున్నాయి.
తీగ లాగితే డొంక కదిలింది..
కొన్నాళ్ల క్రితం ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో గురుసేవక్ సింగ్(67) అనే వృద్ధుడు కెనడా వెళ్లేందుకు వేచి ఉన్నాడు. అతడి వాలకం చూసి సీఐఎస్‌ఎఫ్ పోలీసులకు అనుమానం వచ్చింది. గురుసేవక్‌సిం గ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, అతడు 24 ఏండ్ల యువకుడని తేలింది.
ఇండియాె మధ్య ఆసియా మధ్య అమెరికా అమెరికా
మొదట నకిలీ సెంజెన్ వీసాలతో భారతీయులను ఖజకిస్తాన్, అజర్‌బైజాన్ వంటి మద్య ఆసియా దేశాలకు తరలిస్తారు. అటు నుంచి నేరుగా మధ్య అమెరికా దేశమైన ఈక్వెడార్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి బస్సుల్లో, కార్లలో అమెరికా సరిహద్దుకు తరలిస్తారు.