calender_icon.png 19 April, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లు విక్రయాలపై నజర్!

14-04-2025 01:23:58 AM

అనుమతి లేని దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దృష్టి

గాంధారి ఘటనపై ప్రభుత్వం సీరియస్

నలుగురు అరెస్టు.. 

18 టీఎఫ్టీ  లైసెన్సులు రద్దు

రాజంపేటలో కల్లు డిపో సీజ్

కామారెడ్డి, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి), కల్తీ కల్లు దందా కామారెడ్డి జిల్లాలో కల్లు మూస్తే దారుల అవతారంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు దుకాణాలు తెరిచి కల్తీ కల్లు విక్రయాలు కొనసాగిస్తున్నారు. కల్తీ కల్లు జోరుగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విషయా లపై గత కొద్ది రోజులుగా విజయ క్రాంతి దినపత్రిక లో పలు కథనాలను ప్రచురించినప్పటికీ ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు కల్లు మూస్తే దారుల మామూళ్ల మత్తుకు కొందరు అలవాటు పడి కల్తీ కల్లు విచ్చలవిడిగా అమ్మినా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించారు.

అనుమతులు ఒక చోట తీసుకొని మరోచోట ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో కల్తీకల్లు విక్రయాలు చేపడుతున్న తీరుపై విజయ క్రాంతి దినపత్రిక పలు కథనాలను ప్రచురించడంతో పోలీసులు స్పందించారు, కానీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేకపోయారు. ఇటీవల కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో గాం ధారి మండలంలోని గౌ రారం గ్రామంలో కల్తీ కల్లు సేవించి 100 మందికి పైగా బాధితులు తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం వెలుగులోకి వచ్చిన విషయం విధితమే.

ఈ ఘటనతో మేల్కొన్న ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎక్సైజ్ అధికారులపై సీరియస్ కావడంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమతులు లేకుండా సాగిస్తున్న కల్తీ కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కల్లు మూస్తే దారులు షాక్ గురయ్యారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న 80 పైగా  కల్తీ కల్లు దుకాణాలు మూసి వేశారంటే ఎంత విచ్చలవిడిగా కల్తీ కల్లు దుకాణాలను కల్లు ముస్తే దారులు ఇన్ని రోజులు నడిపించా రా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటు న్నారు.

కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలో టి ఎఫ్ టి లైసెన్సులు పొందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. టి ఎఫ్ టి లైసెన్స్ పొందినవారు వారి చెట్టు ఎక్కి కల్లు గీసి అమ్ముకోవాల్సి ఉంటుంది. టి ఎఫ్ టి లైసెన్స్ దారుల నుంచి కల్లు ముస్తేదారులు కొందరు ఏడాదికి కొంత డబ్బులు చెల్లించి వారి లైసెన్స్ పేరుతో కృత్రిమంగా తయారు చేసిన కల్తీ కల్లును ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై వారికి నెలసరి మామూళ్లు అప్పగిస్తూ ఇష్టానుసారంగా అనుమతి ఒకచోట తీసుకొని కల్లు అమ్మకాలు మరోచోట విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు.

కల్తీ కల్లు విక్రయాలను కొందరు ముస్తేదారుల అవతారమెత్తి టి ఎఫ్ టి లైసెన్స్ పొందిన వారి పేరుపై ఉన్న కల్లు దుకాణాలు సంవత్సరానికి కొన్ని డబ్బులు చెల్లించి  కల్లు మూస్తే దారులు బహిరంగంగా కల్తీ కల్లు అమ్మకాలు చేపడుతున్నారు. అనుమతులు ఓక రకంగా తీసుకొని మరో చోట నిబంధనలకు విరుద్ధంగా తమ ఇష్టానుసారంగా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారు. ఇటీవల కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి టి ఎఫ్ టి లైసెన్స్ కలిగిన కల్లు దుకాణాలలో చిన్నారులు వచ్చి కల్తీ కల్లు కొనుగోలు చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఇటీవల వచ్చిన అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డికి బాధితులు సాక్షాధారాలతో ఫిర్యాదు చేశారు.

ఆమె తమ సిబ్బందితో దాడులు నిర్వహించి చిన్నారుల కు క ల్లు విక్రయించవద్దని దుకాణాలను మూసి వేయించి జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు ముస్తేదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కల్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని, 18 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు కల్లు విక్రయించవద్దని ఆదేశించారు. మాచారెడ్డి కల్లు డిపో యజమానులు ఏఎస్పీ ఆదేశాలను లెక్క చేయకపోవడంతో చైతన్య రెడ్డి మాచారెడ్డి చౌరస్తా లో ఉన్న క ల్లు దుకాణాన్ని మూసి వేయించడంతో దిమ్మదిరిగిన క ల్లు మూస్తే దారులు సీసీ కెమెరాలను వెంటనే   అమర్చారు.

వందమందికి పైగా బాధితులు 

 ఇటీవల కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం దురీకి, అంకోల్, అంకోల్ తండా, హాజీపూర్, మరికొన్ని గ్రామాల్లో కల్తీ కల్లు సేవించి 80 మందికి పైగా బాధితులు తీవ్ర ఆ స్వస్థతకు గురై బాన్సువాడ నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన విషయం  విధితమే. మరుసటిరోజే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం గౌరారం లో 30 మందికి పైగా కల్తీ కల్లు సేవించి ఆ స్వస్థతకు గురైన విషయంపై ప్రభుత్వం ఎక్సైజ్ అధికారుల పని తీరుపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది.

అనుమతి లేని కల్లు డిపోను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

ఇన్ని రోజులు అనుమతులు లేకుండా నిర్వహించిన కల్లు డిపోలు కల్లు దుకాణం లపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో అనుమతి లేకుండా కల్లు డిపో నిర్వా హ ణపై ఆదివారం దోమకొండ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు సిబ్బందితో వెళ్లి కల్లు డిపోను సీజ్ చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు జరుగుతాయని చెప్పి అనుమతులు లేని కల్లు దుకాణాలను మూసివేయాలని లేకుంటే కేసులైతే తమకు ఏమి తెలియదని స్థానిక ఎక్సైజ్ అధికారులు కల్లు మూస్తే దారులకు హెచ్చరికలు జారీ చేయడంతో కామారెడ్డి జిల్లాలో సుమారు 80 వరకు  అనుమతి లేని దుకాణాలను కళ్ళు మూస్తే దాన్ని మూసివేసినట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఐదు కల్లు దుకాణాలు ఉండగా మూడు దుకాణాలను మూసివేశారు. ఇన్ని రోజులుగా అనుమతులు లేకుండానే కల్లు దుకాణాలు నిర్వహించిన ముస్తేదారుల తీరు పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలోని

 ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అనుమతి లేకుండా అక్రమంగా విక్రయాలు చేపడుతున్న కల్లు దుకాణాలను గుర్తించి సీజ్ చేస్తామని ఆదేశాలు రావడంతో స్థానిక ఎక్సైజ్ అధికారులు కల్లు మూస్తే దారుల తో ఉన్న దోస్తానితో మూసుకోవాలని లేకుంటే డ్రగ్స్ నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు అవుతాయని హెచ్చరికలు జారీ చేయడంతో కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్న దుకాణదారులు తాళాలు వేసి విక్రయాలను బందు చేశారు. రాత్రి సమయాల్లో కొన్ని దుకాణదారులు కల్లు ని విక్రయిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు విజయ క్రాంతి తో తెలిపారు. ఉదయం నుంచి కల్లు దుకాణాలు బందు చేసి రాత్రిపూట అమ్మకాలు చేపడుతున్నారని తెలిపారు.

ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆదేశాలను సైతం కల్లు మూస్తే దారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల ప్రాణా లతో చెలగాటం ఆడుతున్న కల్తీ కల్లు వి క్రయాలు చేపడుతున్న కల్లు మూస్తే దారులపై డ్రగ్స్ యాక్ట్ కింద నార్కోటెక్ కేసులు నమోదు చేస్తేనే కల్తీకల్లు విక్రయాలకు చెక్ పడుతుందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకొని కల్తీ క ల్లు అమ్మకాల ఆగడాలను అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

కల్తీ కల్లు పై మంత్రి సమీక్షించే నా....?

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో కల్తీ క ల్లు విక్రయాల పై చర్చిస్తా రా లేదో వేచి చూడాల్సిందే. సంబంధిత అధికారుల తో సమీక్షించి కల్తీకల్లు విక్రయాల ను అరికట్టే విధంగా మంత్రి వ్యవహరిస్తారా లేక మొక్కుబడి సమీక్షతోనే సరిపెడతారా అనేది వేచి చూడాల్సిందే.