22-12-2024 01:31:22 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (విజయక్రాంతి): న్యూ ఈయర్ వేడుకలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నజర్ సారించింది. ఈ సంబురాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్ వినియోగంపై నిఘా పెట్టడానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 ప్రత్యేక టీమ్‌ల ఏర్పా టుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు.
ఈమేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సంవత్సర వేడుకల్లో పబ్స్, బార్స్, స్పెషల్ ఈవెంట్స్, ఫాంహౌస్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. అవుట్‌డోర్ ప్రాంతాలలో నిర్వహించే మద్యం పార్టీలకు ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిరసరి. పార్టీలకు హాజరయ్యే మైనర్లకు ఎట్టిపరిస్థితుల్లో మద్యం సరఫరా చేయరాదు. తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత మద్యం మినహా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం వినియోగిస్తే మాత్రం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంగా కేసులు నమోదు చేస్తాం.
అలాగే వేడుకల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారిపై నార్కోటిక్స్, డగ్స్, అండ్ సైకోట్రాపక్ (ఎన్‌డిపిఎస్) చట్టం కేసులు నమోదు చేస్తాం. డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సరఫరా చేస్తూ గతంలో జైలుకి వెళ్లి ప్రస్తుతం బయట ఉన్న నిందితుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాం. న్యూ ఈయర్ వేడుకలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలి.