calender_icon.png 9 October, 2024 | 4:43 PM

సుదీర్ఘ శిబిరం.. ఉద్యమానికి ఊతం!

09-10-2024 12:00:00 AM

ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం మలిదశ ఉద్యమంలో ఆదిలాబాద్ జిల్లాలో సాగిన ఉద్యమ పోరు ప్రత్యేక ఆకరణగా నిలిచింది. రాష్ర్టవ్యాప్తంగా ఉద్యమం ఉవెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన జేఏసీ దీక్షా శిబిరానికి ప్రత్యేకత నెలకొంది. రాష్ర్టంలోనే సిద్ధిపేటలో కొనసాగిన ఉద్యమ దీక్షా శిబిరం తరాత అంతటి ఉద్యమ స్ఫూర్తితో కొనసాగింది ఆదిలాబాద్ దీక్షా శిబిరం మాత్రమే.

తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఉద్యమం సాగుతున్న సమయం లో 2010 జనవరి 4న ఆదిలాబాద్‌లో రిటైర్డ్ ప్రధానోపాధ్యా యులు కారింగుల దామోదర ఆధర్యంలో జేఏసీ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిరిరామంగా తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించాక (2014 జూన్ 3 వరకు) సుదీర్ఘంగా 1,523 రోజులపాటు శిబిరం కొనసాగింది. 

హేమాహేమీలతో.. 

ఇక్కడి ఉద్యమ స్ఫూర్తి రాష్ర్టస్థాయి నేతలను సైతం ఆకర్షించిం ది. దీంతో కేసీఆర్ నుంచి ఇతర నాయకుల వరకు ఆదిలాబాద్ దీక్ష శిబిరాన్ని సందరించారంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఉద్యమ నాయకుడు కేసీఆర్‌తో మొదలుకొని ప్రత్యేకరాష్ర్ట సాధనకు మద్దతు ఇచ్చిన ఆయా పార్టీల రాష్ర్ట నేతలు, ఉద్యోగ జేఏసీ సంఘాల నాయకులు, కవులు, కళాకారులు ఇలా ఎందరో ఉద్యమకారులు దీక్ష శిబిరాన్ని సందరించారు.  ఇలా ఈ దీక్ష ప్రత్యేకతను చాటుకుంది.

ఉద్యమంలో ఉత్తేజం

జేఏసీ దీక్షా శిబిరానికి ఉద్యమ ఉద్యమ నాయకుడు కేసీఆర్ 2010 డిసెంబర్ 10న 665వ రోజుకు చేరుకున్న సందర్భంగా దీక్ష శిబిరానికి వచ్చారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి 2011లో, సీపీఐ రాష్ర్ట కార్యదరి నారాయణ 2012లో, మాజీ ఎంపీ వి. హనుమంతరావు 2014 జనవరిలో, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పలుమార్లు దీక్ష శిబిరాన్ని సందరించారు.

మాజీ ఎంపీ విజయశాంతి 2012లో, ఉద్యమ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేశవ్ రావు, ఇలా ఎందరో నాయకుకు దీక్ష శిబిరానికి వచ్చి తమ సంఘీభావం తెలియజేశారు. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన గాయని మధుప్రియ సైతం వచ్చి ఉద్యమ పాటలతో ఉత్తేజపరిచారు. 

 -ఆదిలాబాద్, విజయక్రాంతి