calender_icon.png 13 February, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇల్లెందుకు చెందిన యువకుడు మృతి

13-02-2025 09:05:55 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు-ఖమ్మం ప్రధాన రహదారిపై గాంధీనగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇల్లందు పట్టణానికి చెందిన సాయి(32) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లందు పట్టణంకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి నాయకులు దేరంగుల పోశం పెద్ద కుమారుడు సాయి హైదరాబాదు నుంచి ఇల్లందుకు కారులో వస్తుండగా గాంధీనగర్ వద్ద మేకలు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి అదుపుతప్పి కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందారు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇల్లందు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.