calender_icon.png 20 April, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..

20-04-2025 07:39:06 PM

31 ఏళ్ల తర్వాత జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల కలయిక..

పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన విద్యార్థులు..

హుజురాబాద్ (విజయక్రాంతి): ఆనాటి విద్యార్థులు నాడు తాము చదువుకున్న పాఠశాలను చూసి తీపిగుర్తులను నెమరు వేసుకున్నారు. సుమారు 31 సంవత్సరాల తరువాత వారంతా కలిసి తమ ఉపాధ్యాయులను, తోటి మిత్రులను కలుసుకొని సందడి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ జడ్పీహెచ్ఎస్ 1993-94 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు... ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని సందడిగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాలు చేసి, ఆట పాటలతో రోజంతా సరదాగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుల సేవలను కొనియాడుతూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, పూర్వ ఉపాధ్యాయులు కాల్వ జనార్దన్ రెడ్డి, చంద్రయ్య, సీతారామయ్య, రాజేందరప్రసాద్, మల్లారెడ్డి కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.