05-07-2024 01:43:53 AM
20శాతానికి పైగా పెరిగిన పాల ధర
ధరల్లో లండన్‌ను మించిపోయిన పాకిస్థాన్
తారాస్థాయికి చేరుకున్న దేశ ద్రవ్యోల్బణం
పాకిస్థాన్ (కరాచీ), జూలై 4: పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఆదేశ ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి. ఇక్కడ లీటరు పాల ధర రూ.370కి చేరుకుంది. గతవారం బడ్జెట్ సమావేశాల్లో సర్కార్ ఈ మేరకు పాలధరలను పెంచుకునేందుకు ఆమోదం తెలపడంతో తాజాగా కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ప్యాకేజ్‌డ్ పాల ధరపై ప్రభుత్వం అదనంగా 18శాతం ట్యాక్స్ విధించగా పాలధరలు 20శాతానికి పైగా పెరిగాయి. గతంలో ఇక్కడ పాలపై ఎలాంటి ట్యాక్స్ లేకపోవడం గమనార్హం. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లోని లీటర్ పాల ధర అభివృద్ధి చెందిన దేశాలైన పారిస్, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరాలను మించిపోయింది. పాలధర పెరుగుదలతోపాటు నిత్యావసరాల ధరలు కూడా దాదాపు 25శాతం మేర పెరిగాయని బ్లూమ్ బర్గ్ తన నివేదికలో తెలిపింది. పాక్‌లోని దాదాపు 60శాతం ఐదేళ్లలోపు పిల్లలు రక్తహీనత, పౌష్టికాహారలోపంతో బాధపడుతు న్నారు.