calender_icon.png 28 September, 2024 | 6:51 AM

సహకార సిగలో కాంతిరేఖ!

26-09-2024 01:23:47 AM

రైతులకు అండగా ముల్కనూరు సహకార బ్యాంకు

దేశంలో మొట్టమొదటి సహకార రైతు బ్యాంకు

రైతుల సంక్షేమానికి ఇప్పటివరకు రూ.400 కోట్లు 

చనిపోయే వరకూ సంఘ సభ్యుడిగా ప్రధాని పీవీ

రేపు సహకార బ్యాంకు 68వ మహాసభ 

భీమదేవరపల్లి, సెప్టెంబరు 25: పరస్పర సహకారమే ధ్యేయంగా కొంతమంది రైతులతో ఏర్పడిన ముల్కనూరు సహకార సం ఘం సహకార సిగలో రైతుల పాలిట కాంతిరేఖగా విరాజిల్లుతోంది. 300 మంది రైతుల తో ఏర్పాటైన ఈ సహకార సంఘం నేడు 7, 641 మంది రైతులతో పెద్ద సంఘంగా కొనసాగుతుంది.

హనుమకొండ జిల్లా భీమదేవ రపల్లి మండలం ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి అండ్ మార్కెటింగ్ సొసైటీ రైతు సేవలో ప్రపంచఖ్యాతి పొందింది. రైతులకు విత్తనం నాటి నప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు రైతుకు స్పల్పకాలిక, దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలతోపాటు అనేక రకాల సంక్షేమ పథకాలను అందించి అండగా నిలుస్తోం ది.

1956లో రూ.100తో స్థాపించిన ఈ సహకార సంఘం నేడు రూ.400 కోట్ల లావాదేవీలతో విజయవంతంగా సాగుతోంది. సంఘ స్థ్ధాపకులు దివం గత అల్గిరెడ్డి కాశీవిశ్వనాథరెడ్డి స్ఫూర్తితో నేడు రైతులకు అండగా సహకార సంఘం ఉంటోంది. ప్రస్తుతం బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన 132 మంది ఉద్యోగులతో 14 గ్రామాల్లో  7,641 మంది రైతులకు సేవలు అందిస్తోంది. 

రైతులకు రూ.౪౩ కోట్ల బోనస్ 

సహకార బ్యాంకు ప్రారంభం నుంచి నేటి వరకు రైతులకు రూ.43 కోట్లు బోనస్ రూప ంలో అందించింది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న 1218 మంది విద్యార్థులకు రూ.కోటీకి పైగా ప్రోత్సాహాకాన్ని అందించింది. సంక్షేమ పథకాల కింద రూ.300 కోట్లు అందించి పూర్తిగా రైతు పక్షపాతిగా నిలిచింది.

రైతుల కు కంటి పరీక్షలు చేయించి, అవసరమైన వారికి ఆపరేషన్ చేసేందుకు రూ.2 కోట్లు బ్యాంకు పాలకవర్గం అందించింది. ఏటా వి జయదశమి సందర్భంగా బ్యాంకుకు వచ్చిన లాభాల నుంచి బోనస్ రూపంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అందిస్తోంది.

వరి, పత్తి మీద వ చ్చిన లాభాలాను బోనస్ రూపంలో అందిస్తున్నారు. అంతేకాకుండా వృద్ధాప్యంలోకి చే రిన రైతులకు నెలకు పెన్షన్ రూపంలో రూ.800 చెల్లిస్తుండటం విశేషం. రైతులకు పంట అప్పు, మధ్యకాలిక, దీర్ఘకాలిక అప్పు ల కింద నేటి వరకు రూ.230 కోట్లు అందించింది.

ప్రమాదావశాత్తు రైతు మృతిచెందితే ఆ కుటుంబానికి రూ.2 లక్షలు బ్యాంకు చెల్లిస్తున్నది దహన సంస్కారాలకు రూ.15 వేలు అందిస్తోంది. మృతి చెందిన రైతు పంట రుణం రూ.లక్షా50 వేల వరకు మాఫీ చేస్తుంది. 

ప్రముఖుల సందర్శన

ముల్కనూరు బ్యాంకును ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి,  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్‌తోపాటు వివిధ దేశాల్లోని ప్రముఖులు సందర్శించారు. 

27న వార్షిక మహాసభ: అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బ్యాంకు అధ్యక్షుడు 

ముల్కనూర్ సహకార బ్యాంకు వార్షిక మహాసభ ఈ నెల 27న పారాబాయిల్డ్ రైస్‌మిల్లు ఆవరణలో జరుగుతుందని బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నట్టు తెలిపారు.

రైతులకు లాభాలు పంపిణీ

సహకార బ్యాంకు రుణాలు అందించడమే కాకుండా దిగుబడులు సాధించేంత వరకు అండగా ఉంటోంది. ధాన్యం, పత్తి, వరి రైతుల వద్ద కొనుగోలు చేసి వ్యాపార ం నిర్వహిస్తుంది. పత్తిని శుద్ధి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంది. ధాన్యాన్ని రైసు మిల్లు ద్వారా బియ్యంగా మార్చి కరీ ంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ఎగుమతి చేస్తూ ఏటా రూ.400 కోట్ల వ్యాపారం చేస్తోంది.

4 వేల మంది రైతులకు రూ.8 కోట్ల పాడిపశువుల రుణాలను కూడా అందించింది. గత పదేళ్లలో 800 మంది రైతులకు ట్రాక్టర్ల కొనుగోలుకు రుణాలను అందించింది. ఏటా ల క్షా 20 వేల క్వింటాళ్ల బియ్యం అమ్మకాలు జరుపుకొంటూ వచ్చిన 15 శాతం లాభా లు రైతులకు అందిస్తోంది.

నాణ్యమైన వ రి, మక్క విత్తనాలు విక్రయిస్తోంది. సహకార బ్యాంకు పరిధిలోని 3200 మంది రైతులకు రూ.2 కోట్లు ఖర్చు చేసి కంటి ఆపరేషన్‌లు చేయించింది. రైతులకు విశేష సేవలు అందిస్తున్న ముల్కనూర్ సహకార బ్యాంకు జాతీయ స్ధాయిలో ఉత్తమ సహకార బ్యాంకు ఆవార్డు వచ్చింది. రాష్ట్రస్ధాయిలో ఉత్తమ సహకార ఎక్స్‌లెన్స్ ఆవార్డును సొంతం చేసుకొంది.