calender_icon.png 8 February, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి

08-02-2025 08:09:28 PM

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి...

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని శాస్త్ర గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. చైతన్యం కలిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలకులపై తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వచ్చేది గడ్డు కాలమేనని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి గులాబీ జెండా ఎగరేయాలన్నారు. నియోజకవర్గంలో రూ.470 కోట్ల అభివృద్ధికి ప్రోసిడింగ్స్ ఇచ్చామని, వాటిని కూడా ఉపయోగించుకోక వాటిని వెనక్కి పంపారని ఎద్దేవా చేశారు.

గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని, మరో రెండు మూడు రోజుల్లో అబ్దుల్లాపూర్మెట్, యాచారం మండలాలు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మహిళలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుకల బుగ్గ రాములు, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేష్, పార్టీ నాయకులు నిట్టు జగదీష్, బూడిద రాంరెడ్డి, సొసైటీ చైర్మన్లు వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.