నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆదివాసిగూడ దుపతాండలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం గ్రామానికి చెందిన రాంజీ ఆవు లేగ దూడపై చిరుత పులి దాడి చేసి చంపినట్టు రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన అటవీ శాఖ అధికారులు లేగ దూడ కళేబరన్ని పరిశీలించి చిరుత ఆనవాళ్ళ కోసం పాదముద్రలు సేకరిస్తున్నట్లు తెలిపారు.