calender_icon.png 11 March, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుకు అడ్డంగా పడ్డ భారీ చెట్టు..

05-03-2025 07:40:51 PM

ప్రయాణికులకు ఇబ్బందులు..

లింగంపేట్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మేంగారం శివారులో కామారెడ్డి నిజాంసాగర్ కేకే వై రోడ్డుపై బుధవారం భారీ మర్రిచెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ జరిగింది. స్థానికులు పోలీసుల సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును రోడ్డుపై నుండి తొలగించి ప్రయాణికుల సమస్యను తీర్చడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.