calender_icon.png 12 January, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణల చెరలో పెద్ద చెరువు

22-10-2024 02:18:25 AM

  1. ఏకంగా 13 వెంచర్లు ఏర్పాటు
  2. చెరువులోకి వరద చేరడంతో ప్రస్తుతం నీటమునిగిన పలు వెంచర్లు
  3. ఆక్రమణలపై పట్టించుకోని అధికారులు

మేడ్చల్, అక్టోబర్ ౨౧: రియల్టర్ల ధన దాహానికి, అధికారుల అవినీతికి మేడ్చల్ పెద్ద చెరువు చిన్నబోతోంది. అక్రమార్కులు ఈ చెరువును ఆక్రమించి ఏకంగా 13 వెంచర్లు ఏర్పాటు చేశారు. ఇటీవలి వర్షాలతో చెరువులోకి వరద రావడంతో ఈ వెంచర్లు ప్రస్తుతం నీటిలో మునిగిపోయాయి.

ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో వెంచర్లు ఏర్పాటు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పెద్ద చెరువు విస్తీర్ణం మొత్తం 356 ఎకరాలు. మేడ్చల్ పట్టణం నుంచి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుతారిగూడెం వరకు చెరువు విస్తరించి ఉంది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొన్ని వెంచర్లకు గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు గతంలో అనుమతులిచ్చారు.

ఒక వెంచర్‌లో ఆరు ఎకరాల శిఖం భూమి ఉంది. ప్రస్తుతం చెరువులోకి వరద చేరడంతో కొన్ని వెంచర్‌లలోకి నీరు రా కుండా మట్టికట్టలు ఏర్పాటు చేశారు. రియల్టర్లు ప్లాట్లన్నీ విక్రయించి వెళ్లిపోగా, ప్రస్తుతం కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

కొనసాగుతున్న విల్లాల నిర్మాణం

హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడడానికి ప్రభుత్వం హై డ్రాను ఏర్పాటు చేసింది. చెరువులు, ప్రభు త్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా పనితీరు చర్చనీయాంశమైంది. కానీ, మేడ్చల్ పెద్ద చెరువు సమీపంలో మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా విల్లాలు నిర్మిస్తున్నారు.

10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్ బౌండరీ దాటిన తర్వాత 30 మీటర్ల వరకు బఫర్‌జోన్‌గా పరిగణిస్తారు. పెద్ద చెరువు దక్షిణ భాగంలో రెండు వెంచర్లు బఫర్‌జోన్ పరిధిలోకి వస్తాయని తెలుస్తోంది. ఒక వెంచర్‌లో ప్లాట్ల య జమానులు ఇళ్లు నిర్మించుకున్నారు.

ప్రస్తు తం మరో వెంచర్‌లో విల్లాలు నిర్మిస్తున్నా రు. ఇవి పలుకుబడి కలిగిన వారివైనం దున అటువైపు అధికారులు కన్నెత్తి చూడ డం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇందులోని ఒక వెంచర్‌లో పార్క్ స్థలం కూడా అన్యాక్రాంతం చేశారు.

కాల్వలదీ అదే పరిస్థితి

చెరువునే కాకుండా పెద్ద చెరువు కింద ఉన్న వెంచర్లలో కాల్వలు కూడా మాయం చేశారు. అలుగు పారే కాల్వ 15 అడుగులు ఉండాలి. కానీ కొన్నిచోట్ల ఆరు, ఏడు అడుగులు మాత్రమే ఉంది. 15 మీటర్ల కాల్వ అయినందున నాలా వెంట తొమ్మిది మీటర్లు వదిలేయాలి. కానీ, నాలాను పూడ్చి నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు పెద్ద చెరువును, కాల్వలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.