స్వామివారికి ప్రతేక పూజలు, ఓడి బియ్యలతో మొక్కలు తీర్చుకున్న భక్తులు
మనోహరబాద్ (విజయక్రాంతి): శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి ఆలయం వద్ద గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్లకల్ గ్రామా చివరిలో వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి ఆలయం సుమారు 1400 సంవత్సరాల క్రితం వెలిసినట్టు గ్రామస్తులు తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం ధనుర్మస అదివారం పురస్కరించుకొని గ్రామస్తులంతా ఏక తాటిగా ఆలయ ప్రాంగణంలో ఆనవాయతి వస్తున్న వనభోజనాల కార్యక్రమన్ని నిర్వహించి శ్రీ స్వయంభు లక్ష్మీనరసింహస్వామికి అంగరంగ వైభవంగా గ్రామస్తులంతా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ఉండే పాడి పంటలు బాగా పండి గ్రామస్తులతో సుఖసంతోషంగా ఉండాలని ప్రతి ఏటా ఈ వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.